సంబురాలు కాదు.. ముందు రోడ్లు బాగు చేయండి..!
General

సంబురాలు కాదు.. ముందు రోడ్లు బాగు చేయండి..!

Friday, 4 September 20266 views

సంబురాలు కాదు.. ముందు రోడ్లు బాగు చేయండి..!

వాజేడు–భద్రాచలం రహదారి గుంతలమయం

ఇసుక లారీల దెబ్బకు ఛిద్రమవుతున్న రహదారులు.. ప్రయాణికుల ప్రాణాలకు ముప్పు

అధికారులు, ప్రజాప్రతినిధులు నిద్రపోతున్నారా..?

ఇరప రాజు దొర

నవభారత్ చర్ల, సెప్టెంబర్ 03

భద్రాచలం నియోజకవర్గంలో ప్రజలకు అత్యవసరమైన మౌలిక వసతులు కల్పించడంపై దృష్టి సారించకుండా సంబురాలు, ఆర్భాట కార్యక్రమాలకే ప్రాధాన్యత ఇవ్వడం ఎంతవరకు సమంజసమని ఆదివాసీ హక్కుల పరిరక్షణ వేదిక తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ ఇరప. రాజు దొర ప్రశ్నించారు. ప్రజల ప్రాణాలతో ముడిపడిన రహదారుల దుస్థితిని పట్టించుకోకుండా అధికారులు, ప్రజాప్రతినిధులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆయన తీవ్రంగా విమర్శించారు.

వాజేడు నుంచి భద్రాచలం వరకు ఉన్న ప్రధాన రహదారి అనేక ప్రాంతాల్లో గుంతలమయంగా మారడంతో నిత్యం ప్రయాణించే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. రహదారిపై ఏర్పడిన భారీ గుంతలు వాహనదారులకు ప్రమాదకరంగా మారాయని, రాత్రి వేళల్లో పరిస్థితి మరింత భయానకంగా ఉంటోందన్నారు.

ఇసుక లారీలతో మరింత అధ్వానంగా..

భారీ ఇసుక లారీల నిరంతర రాకపోకల కారణంగా ఇప్పటికే దెబ్బతిన్న రహదారులు మరింత ఛిద్రమవుతున్నాయని రాజు దొర ఆరోపించారు. అధిక లోడుతో, వేగంగా దూసుకెళ్తున్న లారీల కారణంగా చిన్న వాహనదారులు భయాందోళనలకు గురవుతున్నారని తెలిపారు.

Share this article

Related Articles