
General
గుర్తు తెలియని చిన్నారి సమాచారం
Thursday, 24 September 2026141 views
తల్లిదండ్రుల కోసం పోలీసులు గాలింపు..
సంగారెడ్డి జిల్లా ప్రతినిధి నవభారత్ సెప్టెంబర్ 23
నర్సాపూర్ పట్టణంలోని ఎల్ఐసి ఆఫీస్ సమీపంలో సుమారు 2 సంవత్సరాల వయస్సు ఉన్న ఒక గుర్తు తెలియని చిన్నారి కనిపించింది. ప్రస్తుతం చిన్నారి తల్లిదండ్రులు లేదా కుటుంబ సభ్యుల వివరాలు తెలియరాలేదు.ఈ చిన్నారిని ఎవరైనా గుర్తించినట్లయితే, లేదా చిన్నారి తల్లిదండ్రులు, బంధువులు లేదా పరిచయస్తుల వివరాలు తెలిసినట్లయితే, వెంటనే వారిని నర్సాపూర్ పోలీస్ స్టేషన్‌కు తీసుకురావాలని కోరుతున్నాము.అలాగే, ఈ చిన్నారికి సంబంధించిన ఏవైనా సమాచారం తెలిసిన వారు నర్సాపూర్ ఎస్‌ఐ రంజిత్ రెడ్డి గారికి ఈ క్రింది నంబర్‌కు 8712657941 తెలియజేయగలరు.
Share this article



