సింగూరు బ్యాక్ వాటర్ లో గుర్తుతెలియని మృతదేహం
General

సింగూరు బ్యాక్ వాటర్ లో గుర్తుతెలియని మృతదేహం

Tuesday, 15 September 2026109 views


సంగారెడ్డి జిల్లా ప్రతినిధి నవభారత్ సెప్టెంబర్ 15

మనూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాయిపల్లి గ్రామ శివారులో, సిరూర్–రాయిపల్లి వంతెన సమీపంలోని సింగూర్ బ్యాక్‌ వాటర్‌లో గుర్తు తెలియని పురుషుడి మృతదేహం లభ్యమైంది. మృతదేహం నీటిలో తేలియాడుతూ కనిపించడంతో స్థానికులు పోలీసు లకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని నీటిలో నుంచి బయటకు తీశారు. మృతుడి వయస్సు సుమారు 35 నుంచి 45 సంవత్సరాల మధ్య ఉండవచ్చని ప్రాథమికంగా తెలుస్తోంది. మృతదేహంపై నలుపు రంగు దుస్తులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మృతుడిని ఎవరైనా గుర్తించినా, ఆయన కుటుంబ సభ్యులు లేదా ఆచూకీకి సంబంధించిన సమాచారం తెలిసినా వెంటనే సంబంధిత పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, మృతుడి వివరాలు, మృతికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు.

Share this article

Related Articles