ఎంహెచ్ఏ పోర్టల్స్‌లో భద్రాద్రి జిల్లాకు రాష్ట్ర స్థాయి గుర్తింపు
General

ఎంహెచ్ఏ పోర్టల్స్‌లో భద్రాద్రి జిల్లాకు రాష్ట్ర స్థాయి గుర్తింపు

Thursday, 20 August 202622 views

ఎంహెచ్ఏ పోర్టల్స్‌లో భద్రాద్రి జిల్లాకు రాష్ట్ర స్థాయి గుర్తింపు

సైబర్ క్రైమ్ అధికారులకు ఎస్పీ రోహిత్ రాజు అభినందనలు

సమన్వయ కేటగిరీలో జిల్లాకు ప్రథమ స్థానం

నవభారత్ భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్టు 20

మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ (ఎంహెచ్ఏ) ఆధ్వర్యంలోని ఎంఆర్ఎమ్, జిఆర్ఎమ్, సమన్వయ, సహాయోగ్ తదితర ఆధునిక పోర్టల్స్‌ను సమర్థవంతంగా వినియోగిస్తూ ఉత్తమ పనితీరు కనబరిచిన తెలంగాణ పోలీస్ యూనిట్లలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు రాష్ట్ర స్థాయిలో గుర్తింపు లభించింది. ఎంహెచ్ఏ పోర్టల్స్‌లో నమోదైన పనితీరు ఆధారంగా ప్రకటించిన ఉత్తమ ప్రదర్శన జాబితాలో సమన్వయ కేటగిరీలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మొదటి స్థానాన్ని సాధించింది. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ ఉత్తమ ప్రతిభ కనబరిచిన సైబర్ క్రైమ్ అధికారులు, సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. సైబర్ నేరాల నియంత్రణలో సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింత సమర్థవంతంగా వినియోగిస్తూ బాధితులకు వేగవంతమైన సేవలు అందించాలని సూచించారు. జిల్లాకు లభించిన ఈ గుర్తింపు పోలీసు అధికారులు, సైబర్ క్రైమ్ సిబ్బంది సమిష్టి కృషికి నిదర్శనమని పేర్కొన్నారు. స్పార్క్ క్లబ్ ద్వారా విద్యార్థులకు అవగాహన సైబర్ నేరాలపై యువతలో అవగాహన పెంపొందించేందుకు జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో స్పార్క్ క్లబ్ ద్వారా ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రియదర్శిని డిగ్రీ కళాశాల, గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులకు శిక్షణ ఇచ్చి, వారి ద్వారా తోటి విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. ఫేక్ లింకులు, ఓటీపీ మోసాలు, ఆన్‌లైన్ మోసాలు, సోషల్ మీడియా మోసాలు, డిజిటల్ అరెస్టులు తదితర సైబర్ నేరాలపై విద్యార్థులకు వివరించారు. సైబర్ మోసాలపై అవగాహన కల్పించడంలో చురుకుగా పాల్గొంటున్న విద్యార్థులను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. సైబర్ నేరాల నియంత్రణలో పోలీసుల చర్యలతో పాటు యువతలో అవగాహన అత్యంత కీలకమని ఎస్పీ పేర్కొన్నారు. విద్యార్థులు సైబర్ అవగాహన కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని, తమ కుటుంబ సభ్యులు, స్నేహితులకు కూడా సైబర్ భద్రతపై అవగాహన కల్పించాలని సూచించారు. ఇదే స్ఫూర్తితో సైబర్ నేరాల నియంత్రణకు మరింత సమర్థవంతంగా పనిచేయాలని అధికారులు, సిబ్బందిని ఎస్పీ అభినందించారు. కార్యక్రమంలో సైబర్ సెల్ సీఐ జితేందర్, ఎస్సై జుబేదా బేగం, సైబర్ సెల్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

Share this article

Related Articles